

జనం న్యూస్,మార్చి18, అచ్యుతాపురం: స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు అచ్యుత డిగ్రీ కాలేజీలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎలమంచిలి కోర్టు సివిల్ జడ్జి పి.విజయ అధ్యక్షతన ఫోక్సో చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూచిన్నారి బాలబాలికలను వివిధ రకాలైన లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఏర్పాటు చేసిన పోక్సో ఆక్ట్ గురించి ఉదాహరణలతో సహా వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్లు అయినా కూడా ఇంకా సరైన అవగాహన లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. శారీరకంగా, మానసికంగా చిన్నారులు ఆనందకరమైన బాల్యాన్ని పొందడం వారి హక్కు అని,ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్యుతా కాలేజీ కరస్పాండెంట్ శేషు, అచ్యుతాపురం అడిషనల్ ఎస్ఐ వెంకటరావు,పివి లోకదాలత్ వైస్ ప్రెసిడెంట్ పివి రమణ,ఏజిపిడి వెంకట్రావు, ఎలమంచిలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీహరి శంకర్రావు,విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.