Listen to this article

జనం న్యూస్ మార్చ్ 18, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని వారి నివాసంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కీర్తిశేషులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి జన్మదినము సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసిన, పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కీర్తిశేషులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి సతీమణి గిరిజాదేవి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, మరియు కుటుంబ సభ్యులు వివిధ మండలాల నుంచి వచ్చిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.