

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒంటిపూటబడులు సక్రమంగా అమలు కావడం లేదు, చిలకలూరిపేట పట్టణం, మండలంలో ఉన్న కార్పొరేట్ ,ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు రెండు పూటల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నుంచి డిమాండ్ చేస్తున్నామని ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి.రాంబాబు నాయక్ అన్నారు.మంగళవారం తహశీల్దార్ హుస్సేన్ ,మండల విద్యాశాఖ అధికారిణి వివిఎస్ రత్న కళలకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఎండ తీవ్రత 34 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుంది. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు మధ్యాహ్నం ఆకలికి ఉండలేరు. కొన్ని పాఠశాలలు ప్రభుత్వం అమలు చేసిన సమయాలను అమలు చేయడం లేదు, ఎండ తీవ్రత వలన విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పాఠశాల యాజమాన్యాలు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. రెండు పూటల పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొని విద్యార్థులకు తగిన న్యాయం చేయ్యాలని అధికారులను కోరారు