


రామకోటి రామరాజు చేపట్టిన కోటి తలంబ్రాల దీక్ష అమోఘం సరస్వతీ శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్ హరిణి జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల దేవస్థాన కోటి తలంబ్రాల దీక్ష మంగళవారం నాడు సరస్వతీ శిశు మందిర్ లో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అక్కడే అందజేసి రామ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్బంగా సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపాల్ హరినాపవన్, మాట్లాడుతూ మమ్మల్ని కూడా బాగా స్వాములను చేయడం మాచే గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొనేలా చేసి కల్యాణ రామునికి మన ప్రాంతం నుండి భద్రాచల దేవస్థాన కల్యానానికి తలంబ్రాలు వెళ్లడం అనేది ఎంతో భక్తితో కూడుకున్న విషయం అన్నారు. ఏమి ఆశించకుండా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి అమోఘం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు గుండు గాయత్రీ, రజిత, భవాని, అక్షర, ప్రణయ, లావణ్య, అంజలి పాల్గొన్నారు.