Listen to this article

జనం న్యూస్, మార్చి 19 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) కమాన్ పూర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన యూసుఫ్ (లల్లు) ను కొద్ది రోజుల క్రితం కృష్ణమూర్తి మరియు గట్టయ్య బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి సోమవారం సాయంత్రం దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన గడప కృష్ణమూర్తి మరియు దాసరి గట్టయ్య తమ ఇంటికి వచ్చి దాడి చేసి నట్లు లల్లు తెలిపారు.తాను ఇఫ్తార్ విందు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళగా తమపై దుర్భాషలాడుతూ దాడి చేశారని లల్లు పేర్కొన్నారు. దీంతో తమ మూతిపై గుద్దడంతో రక్తస్రావమైందని యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ కు ఇరువర్గలవారు వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై గోకుల్ నగర్ కు వెళ్లి స్థానిక ఎస్పై విచారణ జరిపారు. ఇట్టి దాడికి పాల్పడిన గడప కృష్ణమూర్తి మరియు దాసరి గట్టయ్య పై తగు చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని యూసఫ్ (లల్లు) తెలిపారు అలాగే వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు శ్రీనుబాబు లను కోరుతున్నాను.ఇటువంటి దాడులు మరల పునరావృతం కాకుండా నాకు వెపన్ లైసెన్స్ ఇప్పించగలరని పోలీస్ శాఖను కోరుతున్నాను.