Listen to this article

జనం న్యూస్ జనవరి 14(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ ఆఫీస్ నందు సర్పంచ్ మోనాలిసా, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించడం జరిగింది, సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ మన తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగని ఈ పండుగ మూడు రోజులపాటు నిర్వహించుకునే పండుగని ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంటి ముందర మహిళలు ఎంత ఉత్సాహంతో ముగ్గులతో ప్రారంభించి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ అని తెలియజేశారు, ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకగా పంచాయతీ ఆఫీస్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం గెలుపొందిన వారికి సర్పంచ్ మోనాలిసా ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేయడం జరిగింది అని తెలియజేశారు, ఈ ముగ్గుల పోటీల నందు పంచాయతీ మరియు సచివాలయం మహిళా సిబ్బంది ముగ్గుల పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా సంక్రాంతిని పండుగను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు