

జనం న్యూస్ మార్చ్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గత 7 రోజులుగా జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న సమ్మెలో భాగంగా వర్కర్ల సమస్యలపై స్పందిస్తూ గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి రమాదేవి వర్కర్లు చేస్తున్న సమ్మె టెంట్ వద్దకు వెళ్లి వర్కర్ల పట్ల సానుకూలంగా స్పందించారు. తమ పరిధిలో అయ్యే పనులను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాలు, జిల్లా కలెక్టర్ గెజిట్ వేతనాలు చెల్లించేందుకు మరియు వేసవి సెలవులకు వేతనాలు చెల్లించేందుకు, జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లు ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు స్పందిస్తూ అతితక్కువ కాలంలోనే ఇచ్చిన హామీనీ నెరవేర్చలంటూ ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని మా సమస్యలు పరిష్కరించకపోతే తిరిగి సమ్మె బాట పడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్ ముంజం శ్రీనివాస్ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి యూనియన్ జిల్లా కార్యదర్శి మెస్రం సీతారాం, ఉపాధ్యక్షులు వసంత్ రావ్, రాంబాయి, అరిగేలా కోటయ్య, శ్యామలా, ఇందు, యూనియన్ జిల్లా నాయకులు,పద్మా, నాగేశ్వరి రమేష్, తార రమేష్,పతుబాయి, లక్ష్మీ రాంబాయి,మామిడి లక్ష్మీ, క్రిష్ణ శివరాం ఇతరులు పాల్గొన్నారు.
