


కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు రాజీవ్ యువ వికాసం బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప ,డెలికేట్ విట్టల్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ ఆధ్వర్యంలో .బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చెయ్యడం జరిగింది మరియు బీసీకి 42% రిజర్వేషన్ చేయడంతో బీసీ నాయకునికి సన్మానించడం జరిగింది. మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడంతో ఎస్సీ నాయకునికి సన్మానించారు . ఈ సందర్భంగా అప్ప మాట్లాడుతూ. ఒకే రోజు మూడు ఘన విజయాలను ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని, రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగులకు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ ప్రజా ప్రభుత్వం.. మూడు బిల్లులను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రవి పటేల్ ,పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి నాగనాథ్, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నౌషా నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్, డైరెక్టర్ సాయిని అశోక్, మైనార్టీ నాయకుడు గౌస్ సెట్, ఖలీల్, పాషా సెట్, మునీర్ జలీల్ , తుకారం, బొగడ మీద సాయిలు, పోతులింగరం, బాలకృష్ణ, గుండె కల్లూరు మాజీ ఎంపీటీసీ రాజు పటేల్, దశరథ్ స్వామి, హాజీ బాలరాజ్, సిద్ధప్ప పటేల్ , గోపాలపల్లి శివ, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు