

జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్ అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముకుందాపురం గ్రామానికి చెందిన నర్రా శీపాల్ రెడ్డికి కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్, కోదాడ నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాతంగి బసవయ్య చేతుల మీదుగా కిసాన్ కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు గా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన రైతులకు అందే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు మాతంగి బసవయ్య, ఐఎన్టిసి కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెనేపల్లి వీరబాబు, జల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.