

జనం న్యూస్ మార్చి 19(నడిగూడెం) మండల కేంద్రం లో సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ నాటి నైజాం సర్కార్ ని భూస్వాములని గడగడలాడించి వీర తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ తల్లి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అని అన్నారు. కామ్రేడ్ స్వరాజ్యం గారు భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం తుది వరకు పోరాడిన దిశాలి కామ్రేడ్ స్వరాజ్యమని బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు.కామ్రేడ్ స్వరాజ్యం ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ ఎర్రజెండా ద్వారానే సమాజ మార్పు జరుగుతుందని ఆశించి ఒపక్క తుపాకి ఓపక్క ఎర్ర జెండా పట్టుకుని దళాలను ఏర్పాటు చేసి విరోచితమైన పోరాటాన్ని చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల కోసం రైతుల కోసం మహిళల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి తన కుటుంబాన్ని పార్టీకి అంకితం చేసిన మహా యోధురాలు కామ్రేడ్ స్వరాజ్యం అని అన్నారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు కొరట్ల శ్రీనివాస్, ఎస్కే లతిబాబు, బీరవెల్లి సుధాకర్ రెడ్డి, కాసాని కిషోర్, మల్లెల వెంకన్న, వీరబోయిన సైదులు, శాఖ కార్యదర్శి అనంత కృష్ణయ్య, మామిడి వీరబాబు, తురక కనకం తదితరులు పాల్గొన్నారు.