

జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ల సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరం పూల్ భాగ్ కాలనీ 4వ వార్డులో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచమంటూనే ట్లూ ఆప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం సరికాదన్నారు. వెంటనే కరెంట్ చార్జీల భారాలు తగ్గించాలని కోరారు.