Listen to this article

జనం న్యూస్, మార్చి 21 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కరోజు పనికి రాకపోతే కార్మికుడు పనిచేసిన వేతనం నుండి  రికవరీ విధానం రద్దు చేయాలి అని ఆర్జీ-3 సివిల్ కాంట్రాక్టర్స్  జిఎం సివిల్ డైరెక్టర్ ఆపరేషన్ సూర్యనారాయణ, డైరెక్టర్ పి అండ్ పి వెంకటేశ్వర్లు  కి గురువారం కొత్తగూడెంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల గైర్హాజరు   పేరిట సింగరేణి యాజమాన్యం బిల్లునుండి వేలాది రూపాయలు పెనాల్టీ రూపంలో రికవరీ చేస్తుందన్నారు. దీనివలన మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నామన్నారు. లేబర్ సప్లై టెండర్లలో పనిచేస్తున్న కార్మికులఒక రోజు హాజరు కాకపోతే  720/- రూపాయలు కోత  విధించడం జరుగుతుందన్నారు. అలాగే పని స్థలంలో కార్మికులకు ఏదైనా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందిస్తుందని తదుపరి  హాస్పిటల్ నిర్వాహక ఖర్చులు కూడా సింగరేణి సంస్థనే భరించాలన్నారు.
ఇట్టి విషయం కొన్ని నెలలుగా సింగరేణి యాజమాన్యానికి  పై అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లినప్పటికీ దీని పరిష్కారానికి కమిటీ వేశామని నోటు పెట్టామని కాలయాపన చేస్తూ పరిష్కరించక కాంట్రాక్టర్ కి కార్మికుల మధ్య గొడవలు జరిగే విధంగా యాజమాన్యం తీరు ఉంది అని అధికారులకు తెలియజేశారు. ఈ పెనాల్టీ ల కారణంగా ఆర్జి-3 ఏరియాలో కాంట్రాక్టర్స్  గత కొంతకాలంగా లేబర్ సప్లై టెండర్లు కాంట్రాక్టర్స్ వేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం పేనాల్టీ సిస్టం రద్దు తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. ఈ పెనాల్టీ విధానాన్ని రద్దు చేయకుంటే కాంట్రాక్టర్స్ మనుగడ ప్రశ్నార్దకరంగా మారే అవకాశం ఉందని అన్నారు.కార్యక్రమంలో డి. శంకరయ్య,ఇ. ఓదెలు,జి.ఓదెలు,ఎన్.సమ్మయ్య, ఎన్.శంకర్, కే.సదయ్య, వి. రవీందర్ రావు,తిరుపతి తదితర కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు.