

జనం న్యూస్ మార్చ్ 20 వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ గ్రామానికి చెందిన సుంకరి శ్రీలక్ష్మికి కామినేని మెడికల్ కళాశాల యందు ఉచిత ఎం బీ బీ ఎస్ సీటు సాధించారు. వారికి ట్యూషన్ ఫీజు నిమిత్తము కొరకై యాభై వేల రూపాయలు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, శ్రీలక్ష్మి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మాణిక్యం,మాజీ కౌన్సిలర్ కృష్ణ, విజయ్, సంతోష్, తదితర మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు పాల్గొన్నారు.