

జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఒగ్గు మల్లయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడు రాకేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి మల్లయ్య అంతేక్రియల కొరకై 4000 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామస్తులకు పేద ప్రజలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేద ప్రజలు అధైర్య పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ యువ నాయకుడు హౌస్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.