Listen to this article

జనం న్యూస్ జనవరి 13

కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో వాహనదారులు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించేవిధంగా చూడాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కాగజ్నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాగజ్నగర్ డిఎస్పి కి వినతిపత్రం అందించారు…
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్ నగర్ పట్టణంలో వాహనదారులు కనీస భద్రత ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా నడపడం వలన తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయని అన్నారు…
ఇష్టానుసారంగా రోడ్డుపైన పార్కింగ్ చేయడం వలన ప్రజలు తీవ ఇబ్బందులు పడుతున్నారని, పార్కింగ్ కు ప్రత్యామ్నాయ ఏర్పాటు చూడాలని కోరారు…
కాగజ్నగర్ లో పెరుగుతున్న జనాభా అదృష్ట రాజీవ్ గాంధీ చౌరస్తా ఎన్టీఆర్ చౌరస్తాలలో సిగ్నల్ సిస్టం ని ఏర్పాటు చేయాలని కోరారు…
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సాయి కృష్ణ, నాయకులు సాయికుమార్, కార్తీక్ పాల్గొన్నారు