

జనం న్యూస్ మార్చి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లపై తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్‌పై కేసులు నమోదవుతున్నా.. బెట్టింగ్ యాప్‌ల నిర్వహకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్‌లు చలామణిలో ఉన్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. బెట్టింగ్ యాప్‌ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నది మాత్రం ఒకరే. సాఫ్ట్వేర్ కోసం ప్రతి నెల కొంతమొత్తంలో చెల్లిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా రోజుకు వందల కోట్ల రూపాయలను నిర్వహకులు సంపాదిస్తున్నారు. ఈజీగ డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్‌లను ఒక మార్గంగా ఎంచుకుంటూ.. సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు యాప్ నిర్వహకులు. బెట్టింగ్ ఓ రకంగా జూదం లాంటిదే. డబ్బు అనే ఒక ఆశ చూపించి బెట్టింగ్ యాప్ నిర్వహకులు రెచ్చిపోతున్నారు. జాయినింగ్ బోనస్‌ల పేరిట మొదట బెట్టింగ్‌కు అలవాటుచేసి ఆ తర్వాత బెట్టింగ్ అనే ఊబిలోకి దించుతున్నారు. ఓసారి బెట్టింగ్‌కు అలవాటుపడితే బయటకు రావడం కష్టంగా మారు