

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాలు అందుకున్న బీజేపీ రాష్ట్ర నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,ను కలుసుకున్నారు. ముందుగా నడ్డాతో అరగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో మంచి ఫలితాలు సాధించిన నేతలను నడ్డా అభినందించారు. ఇలాగే కష్టపడితే తెలంగాణలో అధికారం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పార్ల్‌మెంట్ భవనంలో అమిత్‌షాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, నాయకులు కలిశారు ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించిన మల్క కొమురయ్య, అంజిరెడ్డిని అమిత్ షా అభినందించారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం పాటించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సర్వే గురించి కూడా అమిత్ షా మాట్లాడారు. మనం బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రం అడ్డుకోవాలని టీ-బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు.