Listen to this article

పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు చర్యలపై సమీక్షా.

పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా.

జనం న్యూస్, మార్చ్ 22, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి)ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోనీ జాతీయ రహదారి ఎన్ హెచ్ -63, ఎన్ హెచ్ -363 మరియు రాష్ట్ర రహదారి ఎస్ హెచ్ -1, ఎస్ హెచ్ -24, ఎస్ హెచ్ -08, వేరే రహదారులలో 2022 నుండి 2024 వరకు జరిగిన ప్రమాదాల వివరాలు, చనిపోయిన వారికీ వివరాలు, ప్రమాదం గల కారణాలు, ప్రమాదాల నివారణ తీసుకొన్న చర్యలు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, తదితర అంశాలపై ట్రాఫిక్ పోలీస్ మరియు సంబందింత పోలీస్ స్టేషన్ ల అధికారులతో రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా “రోడ్డు సేఫ్టీ” సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రాంతాలను, బ్లాక్ స్పాట్స్ ను పవర్ గూగుల్ మ్యాపింగ్ ద్వారా సీపీ కి వివరించడం జరిగింది.సిపి మాట్లాడుతూ ….. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి మొదల నుంచి చివరి వరకు ప్రయాణించే వారికి ట్రాఫిక్, రోడ్డు సేఫ్టీ పై ఒక నమ్మకం, భరోసా కలగాలి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని , బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్, ట్రాఫిక్ అధికారులు, ఇతర సంబందిత అధికారుల తో కలిసి స్పాట్స్ సందర్శించి ప్రమాదాలకు సంబందించిన కారణాలు గుర్తించాలి, నివారణ మార్గాలను గుర్తించి పరిష్కార మార్గాల ఏర్పాటుకు కృషి చేయాలి. రేడియం స్టికర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారుల పై అవసరమైన చోట వాహన వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేయాలని, కెమెరాలు, లైట్లు, స్పీడ్ కెమెరాలు, జంక్షన్ ల వద్ద, పాదచారులు రోడ్డు దాటే దగ్గర జిబ్రా క్రాసింగ్, లైటింగ్, రోడ్డు రిఫ్లెక్టింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని సిపి గారు సూచించారు. మీ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలను సందర్శించాలి ప్రతి విషయం తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలి. రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. సిసి కెమెరాల ఏర్పాటు కు ప్రాముఖ్యత ఇవ్వాలి నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలు పోషిస్తాయి. ప్రజలు రద్దీ ఉండే ప్రాంతాల్లో విసిబుల్ పోలీసింగ్ ఉండాలి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ కాకుండా స్నాచింగ్, రాబరీ, గంజాయి అక్రమ రవాణాను మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించవచ్చు. డ్యూటీ సమయంలో సిబ్బంది మరియు అధికారులు స్వీయ రక్షణ పాటిస్తూ , జాగ్రత్తలు తీసుకోని విధులు నిర్వహించాలి అని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, రామగుండం శ్రీ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఐటీసీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సీసీఅర్బీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, సిసి హరీష్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.