

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం సామజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు పరీక్షల్లో జవాబులు క్లుప్తంగా రాయాలని, ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి సులువుగా ఉన్న వాటిని మొదటగా రాసి, సమయాన్ని అనుకూలంగా మలుచుకుని, ప్రశ్నలకు జవాబులు రాయాలని కోరారు, విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు