

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శుక్రవారం విజయనగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద ఉన్న పార్సెల్ సర్వీస్ కౌంటర్ ను డిప్యూటీ చీఫ్ మేనేజర్ కమర్షియల్ బి .అప్పలనాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటర్ లో ఉన్న సిబ్బంది మరియు హమాలీ లు మరింత ఎక్కువగా బిజినెస్ డెవలప్ చేయాలని కోరారు .వినియోగదారులు కూడా ఈ పార్సెల్ సేవలను మరింత ఎక్కువ ఉపయోగించుకోవాలని కోరారు .విజయనగరం బస్టాండ్ లో ప్రత్యేక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, దీనిని అందరూ ఉపయోగించుకోవాలని ,రాష్ట్రం లో ఎక్కడినుండి ఎక్కడికైనా అయినా పార్సిల్స్ 48 గంటలు లో చేరవేయబడునని ,విజయనగరంకౌంటర్ 24 గంటలు కూడా పని చేయునని తెలియజేసియున్నారు. ఈ కార్యక్రమానికి ఏటీఎం కమర్షియల్ దివ్య డిఎం ఈ రాజు ,డిఎంఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.