Listen to this article

జనంన్యూస్ జనవరి 13 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా

జూలపల్లి మండల కేంద్రము లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం జరిగిన శ్రీ గోదారంగ నాదుల కళ్యణ ఉత్సవాల్లో భాగంగా తాజా మాజీ సర్పంచ్ దారి బోయిన నరసింహ యాదవ్ ఆలయానికి తాళిబొట్టు పుస్తెమట్టెలు సమర్పించారు తాజా మాజీ ఉపసర్పంచ్ కొప్పుల మహేష్ నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మహేష్ మాట్లాడుతూ ప్రజల అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు