Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 23 // కుమార్ యాదవ్// జమ్మికుంట..

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక వద్ద పట్టుకున్నారు. లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసిన పోలీసులు, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.