

గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.
జనం న్యూస్, మార్చి 24, (బేస్తవారిపేట ప్రతినిధి):
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అన్నా వెంకట రాంబాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత రాజకీయాలలో అరుదైన అద్భుతమైన నాయకుడని చెప్పవచ్చు. రాజకీయాలలో విజయం సాధించినప్పుడు ఉండే ఉత్సాహం పరాజయము చెందినప్పుడు సహజంగా ఏ రాజకీయ నాయకులకు ఉండదు. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నాయకులు చాలామంది ప్రజలకు దూరంగా ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో చాలామంది నాయకులు ఓటమి నుంచి కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. రాజకీయాలలో అరుదుగా కొంతమంది నాయకులు విజయాన్ని, అపజయాన్ని సమానంగా స్వీకరించి నిరంతరము ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుడు అన్నా రాంబాబు అని చెప్పటానికి గర్వంగా ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం పొందిన మరుసటి రోజు నుంచి తమకు మద్దతుగా నిలిచిన నాయకుల ఇంటికి వెళ్లి మీరందరూ నాకు ఎన్నికలలో మద్దతుగా నిలిచినందుకు అభినందనలు తెలియజేసిన ఏకైక నాయకుడు అన్నా రాంబాబు అని నిస్సందేశంగా చెప్పవచ్చు. పరాజయము పొందినామని నిరుత్సాహపడకుండా మరల ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అందరిని పలకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనో ధైర్యాన్ని నింపిన నాయకుడు అన్నా రాంబాబు అని చెప్పవచ్చు. మార్కాపురం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గాని ఏ కార్యక్రమానికి పిలిచిన తప్పక హాజరవుతూ ఆ కార్యక్రమాలలో నాయకులను కార్యకర్తలను పలకరిస్తూ వారి సమస్యలను ఎప్పటికీ అప్పుడు తెలుసుకుంటూ అక్కడే ఉన్నత అధికారులతో ఫోను ద్వారా మాట్లాడి ప్రజల సమస్యలు విన్నవించు కుంటూ ముందుకు సాగిపోవడం అనేది అన్నా రాంబాబు లాంటి కమిట్మెంట్ గల నాయకులకు మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. పార్టీలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్న వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని నేను మీకు అండగా ఉంటానని వారితో మాట్లాడి మరల పార్టీలో ఉత్సాహంగా పాల్గొనేటట్టు చేయడంలో సఫలీకృతం అవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయాలలో, రాజకీయ నాయకులు సంపద సృష్టిలో భాగంగా వందల కోట్లు సంపద సృష్టిస్తుంటే అన్నా రాంబాబు లాంటి అరుదైన నాయకుడు, కోట్ల ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారంటే ప్రస్తుత రాజకీయాలలో అవినీతి రహిత పాలకులు ఉంటారు అనేదానికి అన్నా రాంబాబు లాంటి రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శ నాయకుడిని చెప్పవచ్చు. అన్నా రాంబాబు రాజకీయ జీవితం మొత్తం అవినీతి రహిత పరిపాలన, ప్రజా సంక్షేమము, అభివృద్ధి, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండడం అందువల్లనే అన్నా రాంబాబు లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయాలలో అరుదైన అద్భుతమైన రాజకీయ నాయకుడని గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజల భావనని ఖచ్చితంగా చెప్పవచ్చు.