Listen to this article

జనంన్యూస్. 24. నిజామాబాదు. టౌన్.

నిజామాబాదు జిల్లాలో 3నెలల జీపీ బకాయి వేతనాలను అందించాలి జిపి వర్కర్స్ ను విస్మరిస్తే సర్కార్ కు బుద్ది చెప్తాం అని, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ అనుబంధం 106) జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్. రమేష్ హేచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మపంచాయతీలో పనిచేస్తున్న 60వేల సిబ్బందికి మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ అనుబంధం 106) జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్. రమేష్ * అన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ అనుబంధం 106) ఆధ్వర్యంలో సోమవారం నాడు నేడు జిల్లా కలెక్టర్. కు వినతి పత్రం ఇచ్చి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల మొదటి తారీఖున గ్రామపంచాయతీ ఉద్యోగులకు వేతనాలు అందిస్తానని ఇచ్చిన హామీ విస్మరించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి వారంలో ఇస్తున్నట్టుగా గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు జీపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించడం లేదని ఆయన ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కోర్టు ధిక్కరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ పెరిగిన జనాభా అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం పై సమస్యలపై స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు మురళి, సత్తేవ్వ,కే.రాజేశ్వర్,మురళి, అరవింద్, ఆశన్న, రాజన్న, బాలకిషన్, నాగరాజు, వీలాష్, తదితరులు పాల్గొన్నారు. స్పందించిన అడిసినల్ కలెక్టర్ ప్రభుత్వం కు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.