

జనం న్యూస్
జనవరి 13
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామం నుండి వరంగల్ జిల్లా లో నిర్వహించే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఎడ్లబండ్లు ఊరేగింపుగా బయలుదేరాయి. గ్రామంలో అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎడ్లబండలను కట్టుకొని ఊరేగింపుగా భోగి రోజున కొత్త కొండకు బయలుదేరుతారు. ఈ క్రమంలో గ్రామస్తులు బండ్లవద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఊరేగింపులో డప్పు దరువులతో, శివసత్తుల పూనకాలతో, కాగడాల వెలుగులతో శోభాయమానం సంతరించుకుంటుంది. ఈ కార్యక్రమంలో అంకతి భద్రయ్య, అంకతి కనకయ్య, అంకతి ఐలయ్య, వనపర్తి ఐలయ్యలతోపాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు