

జనం న్యూస్, మార్చి 25, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఈ రోజు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి పురవీధుల గుండా అమర్ చంద్ కల్యాణమండపం వరకు క్షయ వ్యాధి నివారణ అవగాహనా ర్యాలీ ని నిర్వహించారు. తదనంతరం అమర్ చంద్ కల్యాణమండపం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా . జి. అన్నాప్రసన్న కుమారి మాట్లాడుతూ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన నిక్షయ్ శివిర్ 100 రోజుల కార్యక్రమము ద్వారా హైరిస్క్ జనాభా 120345 మంది లక్ష్యం కాగా 132944 (110 శాతం) మందికి టి.బి. స్క్రీనింగ్ చేసి అందులో 14723 మందిని టి.బి. అనుమానితులను గుర్తించడం జరిగినది. అందులో 8,584 మందికి తెమడ పరీక్ష మరియు 13263 మందికి ఎక్స్ – రే పరీక్ష నిర్వహించగా తెమడ పరీక్ష ద్వారా 226 మందికి మరియు ఎక్స్ – రే ద్వారా 276 మందికి అనగా మొత్తం 502 మందిని క్షయ వ్యాధి సోకిన వారిగా గుర్తించడం జరిగినది. వీరందిరికి చికిత్స ప్రారంబించనైనది. వీరికి పౌష్టికాహారం కోసం న్యూట్రిషన్ కిట్స్ లను చిన్న తరహా పరిశ్రమల సంస్థ సౌజన్యంతో అభయ ఫౌండేషన్ వారి ద్వారా అందించడం జరిగినది . ఇట్టి న్యూట్రిషన్ కిట్స్ ను 6 నెలలు లేదా చికిత్స పూర్తి అయ్యే కాలానికి నెలకు సుమారు రూ.750/- విలువ చేసే న్యూట్రిషన్ కిట్ లను స్థానిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి నెల అందించడం జరుగుతుంది అని అన్నారు. ఈ నిక్షయ్ శివిర్ కార్యక్రమం విజయవంతం అగుటకు జిల్లా కలెక్టర్ గారి సహకారం ఎంతో ఉన్నది అని, వారు ఎక్స్ రే మిషన్ ను కొని ఇచ్చారు అని అన్నారు. సరిఅయిన పౌష్టికాహారం తీసుకుంటూ మందులు సక్రమంగా వాడినచో ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుంది అని అన్నారు, ఈ వ్యాధి మందులతో పూర్తిగా నయం అవుతుందని ప్రజలు ఎటువంటి అపోహ పడకుండా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నచో తెమడ లేదా ఎక్స్ రే పరీక్షలు చేయించుకొని క్షయ వ్యాధి సోకింది లేనిది నిర్దారించుకొని మందులు వాడాలి అని అన్నారు. క్షయ వ్యాధి నిర్దారణ అయిన వారు మందులు సక్రమంగా వాడవలెను , ఆల్కహాల్ , ధూమపానం అలవాటు ఉన్నచో మానుకోవాలి, ప్రోటీన్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. మరియు వారికిచ్చిన న్యూట్రిషన్ కిట్స్ లోని ప్రోటీన్ మరియు ఇతర సరకులను నెల మొత్తం వారికి మాత్రమే ఉపయోగించాలి.ఈ సందర్బంగా వివిధ అవగాహనా కార్యక్రమాలలో పాల్గొన్న టిబి ఛాంపియన్ వి . రామకృష్ణ ను సన్మానించారు.ఈ కార్యక్రమం లో పద్మ పాణి స్వచ్చంద సంస్థ , వై ఆర్ జి స్వచ్చంద సంస్థ ల ప్రతినిధులు పాల్గొని వారి సేవలను వివరించారు. ఈ కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ కనపరచిన వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. మరియు 502 మంది క్షయ వ్యాధి గ్రస్తులు తప్పకుండా మందులు వాడేలా చూసే బాధ్యత మనందరిది అని ఉద్గాటించారు. ఈ మందులు రెండు వారాల వరకు వాడినచో ఇతరులకు ఈ వ్యాధిని వ్యాప్తి చెందించరు కానీ బ్యాక్టీరియా వారి శరీరంలో వుండును , కాబట్టి ఆరు నెలల వరకు మందులు వాడాలి అని అన్నారు . అదే విధంగా 2 నెలలకు, 4 నెలలకు మరియు 6 నెలలకు ఫాలోఅప్ కు రావాలి అంటే తెమడ పరీక్ష పాజిటివ్ వచ్చిన వారు మళ్ళీ తెమడ పరీక్ష, ఎక్స్ రే పరీక్ష పాజిటివ్ వచ్చిన వారు మళ్ళీ ఎక్స్ రే పరీక్ష చేయించుకోవాలి. అవసరం అయినచో మందులు మారుస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమం లో టి బి ప్రోగ్రామ్ అధికారి డా . కె . వి .సుధాకర్ రెడ్డి, ఇతర ప్రోగ్రామ్ అధికారులు డా . బి . శ్రీ రాములు , డా . వి . వాణి శ్రీ , డా . బి. కిరణ్ కుమార్ , వైద్యాధికారి డా . శ్రవణ్ కుమార్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కె. రాజగోపాల్ , ఐ సి టి ఎస్ మరియు టి బి ప్రోగ్రాం సిబ్బంది , ఎ. ఎన్. ఎం. లు పాల్గొన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పెద్దపల్లి.
