Listen to this article

జనం న్యూస్-మార్చి 25-నాగార్జునసాగర్ రిపోర్టర్ విజయ్:-

నాగర్జునసాగర్ :నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని సోమవారం నాడు కాయకల్ప బృందం సందర్శించి పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా మరియు ఏరియా ఆసుపత్రులను ఈ బృందం ప్రతిఏటా సందర్శించి పరిశీలిస్తుంది. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను, పరిశుభ్రతను, ఆసుపత్రి నిర్వహణను, పరిసరాల పర్యావరణాన్ని, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించి నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తారు. ఉత్తమమైన, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులను ఎన్నిక చేసి ప్రోత్సాహక అవార్డులను అందజేస్తారు. రాష్ట్రం నుండి ఎన్నికైన తర్వాత జాతీయ స్థాయిలో ఎన్నికకు పంపడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ఆసుపత్రిగా ఎన్నికైన ఆసుపత్రికి ప్రథమ అవార్డు అందజేయడం జరుగుతుంది.. దీనిలో భాగంగా సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక బృందం సాగర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. తమ పరిశీలన నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందించనున్నారు. వీరితో పాటు స్థానిక కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ హరికృష్ణ, ఇతర వైద్య బృందం,నర్సింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.