

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లుగారి మహేష్
జనం న్యూస్ మార్చి 25 : బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని, ఎస్ సి, ఎస్ టి, బి సి మైనార్టీ, యువత కు.6000 కోట్లతో 5లక్షల యువత కు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశ్యం తో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను పట్టించుకున్న దాకలాలు లేవు ఉద్యోగలు వేయలేవు నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఒక సంవత్సరం లో 55వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిది. అని గుర్తు చేసారు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చి నిరుద్యోగు ల ఆర్థిక పరిస్థితి నీ మెరుగుపరిచడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందరు సద్వినియోగం చేసుకోగలరని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లు గారి మహేష్ కోరారు.