Listen to this article

*ముచ్చటగా మూడు రోజులు జాతర*

జనం న్యూస్ తూప్రాన్, జనవరి, 14. తూప్రాన్ మండలం (ఇస్లాంపూర్) జేజపట్నం శివారులోని రామప్పగుట్ట పై సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుట్టపై వెలిసిన స్వయం భూ రామలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు రామాలయం, గణపతి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, వాల్మికం తదితర ఆలయాలను రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పూజారి హనుమాన్ మాల గురుస్వామి శలక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ 14, 15, 16, మంగళవారం బుధవారం గురువారాలు సంక్రాంతి పండుగ రోజు నుంచి మొదలుకొని వరుసగా మూడురోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. మంగళవారం జాతర ఉత్సవాలు బండ్ల ఊరేగింపులతో మొదలై రెండవ రోజు గోపాల గోపాల కల్వలు, గురువారం హోమం రథోత్సవం కార్యక్రమాలతో ముగుస్తాయి అని తెలిపారు. జాతరకు నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి ఆత్రేయ శర్మ పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి సలాక ఆత్రేయ శర్మ, పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.