

పయనించే సూర్యుడు, జనవరి 14, పోతుగంటి రామ్ ప్రసాద్ ఖమ్మం జిల్లా ,సింగరేణి మండలం, చీమలపాడు బాజుమల్లయిగూడెం కోదండ రామాలయంలో 50వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పూర్తయిన సందర్భంగా 10/01/25 నుండి17/01/25 వరకు ఏడు రోజులు 24 గంటలు అఖండ హరే రామ నామ సప్తాహం కార్యక్రమం సంకీర్తననంద రాజు బృందం వారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా జరుగుచున్నది .ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేశామని ,ఈ ఏడు రోజులు హరే రామ నామం వినడం మాకెంతో సంతోషంగా ఉందని,ఏడు రోజులు నిర్విఘ్నంగా హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామనామ భజన చేయడం మామూలు విషయం కాదని, ఈ కార్యక్రమం మా గ్రామంలో జరగడం మాకు ఎంతో గర్వకారణం అని, మేము ఈ గ్రామంలో జన్మించడం పూర్వజన్మ సుప్రగతంగా భావిస్తున్నామని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు.అదేవిధంగా ప్రతిరోజు చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు స్వామివారి దర్శనం చేసుకొనుటకు వచ్చి ,భజన చేస్తూ మా గ్రామ ప్రజలతోపాటు నృత్యం చేస్తూ ఎంతో భక్తి భావన వ్యక్తం చేస్తున్నారని మాకెంతో సంతోషకరంగా ,రెట్టింపు ఉత్సాహం కలుగుతుందని గ్రామస్తులు తెలియజేశారు .చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మాట్లాడుతూ మా ఊరు కూడా వచ్చి మా యొక్క దేవాలయాల్లో 11 సార్లు హనుమాన్ చాలీసా భజన చేసి ఊరిలో నగర సంకీర్తన చేసి మా ఊరి గ్రామ ప్రజలను కూడా ఆహ్వానించారని మాకెంతో సంతోషంగా ఉందని ఈ విధంగా ప్రతి ఊరు వచ్చి రామనామంతో మమ్ములను ఆహ్వానించడం అదృష్టంగా భావించి, స్వామివారి దర్శనం కొరకు వచ్చి రామనామ వింటూ నృత్యం చేయడం ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా భక్తులందరూ అఖండ హరే రామ నామ సప్తాహం పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నామన్నారు