Listen to this article

జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్ లోనూ, వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ మెడల్స్ సాధించిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలితను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ ) చైర్మన్ అనిమిని రవినాయుడు బుధవారం శాప్ రాష్ట్ర కార్యాలయంలో అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పారా క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే 1.25 కోట్ల రూపాయిలు ప్రోత్సాహన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విడుదల చేసారని అన్నారు. అలాగే విశాఖపట్నం లో క్రీడా ప్రాంగణం కోసం 25 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. భవిష్యత్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించి రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామి, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, పారా జిల్లా మేనేజర్ పాకలపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు