Listen to this article

జనం న్యూస్ 27 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా

భారతీయ జనతాపార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో, తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో, వారు మాట్లాడుతూ,అందరూ ఎంతగానో ఎదురు చూస్తోంది మాత్రం కొత్త రేషన్ కార్డులకే. ఎందుకంటే పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో దరఖాస్తులను సేకరించింది. కొంతమంది ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకున్నారు.ప్రభుత్వ పథకాలు పొందడానికి కొత్తగా పెళ్లయినవారు ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్కార్డు నుంచి పేర్లు తొలగిస్తేనే కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ను ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా మార్పులు చేర్పులు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా, రాజకీయ ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదు.ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని యువకులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా, కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదవారు నష్టపోతున్నారని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాగే ప్రజలను మోసగిస్తే, గత బి.ఆర్.ఎస్ కు పట్టిన గతే ప్రస్తుత కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి జి వెంకటేష్ యాదవ్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, జిల్లా బీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు లక్ష్మాచారి, జి.రఘు, జింకాలి వెంకటేష్, జి.వీరేష్ తదితరులు పాల్గొన్నారు.