Listen to this article

జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్ నందు జిల్లా రాంచరణ్ యువశక్తి టీం ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన నాయకులు గురాన అయ్యలు గారు మాట్లాడుతూ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారన్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నారన్నారు.గ్లోబల్ స్టార్ గా ఎదిగినా తన అంకితభావం, వినయం మారలేదన్నారు…సేవ రంగంలో కూడా తండ్రి ని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు అధికంగా నిర్వహిస్తున్నారన్నారు.రామ్‌చరణ్‌ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రార్థించారు.మెగా ఫ్యామిలీ ఆశయ సాధన లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం సభ్యుల సేవలను కొనియాడారు.అనంతరం మెగా అభిమానులు జనసేన నాయకుల సమక్షము లోకేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.రక్తదాతలకు మెమొంటోలు అందజేసీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేన నాయకులు, జనసైనికులు,వీరమహిళలు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.