Listen to this article

జనం న్యూస్ -మార్చి 28 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం గోర్ బోలి భాషను అధికార భాషగా గుర్తించి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల ఆల్ ఇండియా బంజారా సంఘం నాగార్జున్ సాగర్ టౌన్ ప్రెసిడెంట్ చందూలాల్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు, ఈ తీర్మానంతో కాంగ్రెస్ పార్టీకి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితం అయ్యిందని అన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ తీర్మానం సాధ్యమైందని, యావత్ గిరిజనుల తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.