

జనం న్యూస్ 28 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్:జోగులాంబ గద్వాల్ జిల్లా రైతులతో కలిసి,బైక్ పై వెళ్ళి,ఎండిన పంట పొలాలను పరిశీలించిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే గద్వాల నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని,రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు, బాసు హనుమంతు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గద్వాల మండలం కొత్తపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను బైక్ పై వెళ్ళి,పార్టీ నాయకులు,రైతులతో కలిసి,పరిశీలించారు… ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడుతో రైతులు తమ బాధనుచెప్పుకొచ్చారు.. వరి పొలానికి అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని,నీళ్ళు లేక పంట మొత్తం ఎండిపోయిందని బోరున విలపించారు. పంటలు ఎండిపోవడంతో తమ కుటుంబంలు అప్పుల్లో కోరుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వంలో మండుటెండల్లో సాగునీటి కాలువలు జలాలతో కళకళలాడాయని,నేడు అవే కాలువలు నీళ్లు లేక వెలవెలబోతున్నయని బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాలువలు ఎడారిగా మారాయని, నీరు లేకనే నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని,పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని అన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేకపోతుందని మండిపడ్డారు.. వెంటనే జిల్లా కలెక్టర్ గారు,S.E.గారు స్పందించి, కాలువలకు నీరు వచ్చే విధంగా కృషిచేసి, మిగతా పంటను కాపాడాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోనేష్,డి.శేఖర్ నాయుడు,వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రాములు,తిరుమలేష్,G. వెంకటేశ్వర్ రెడ్డి,ముని మౌర్య,చిన్న,T. వెంకటేశ్వర్ రెడ్డి,వెంకటేష్,నరసింహులు,కె.ఈశ్వరన్న,బెల్లం రమణ,ఆంజనేయులు,అనిల్, హనుమన్న,మహిళా రైతులు,చేన్నమ్మ, రాములమ్మ,మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు,యూత్ సభ్యులు గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు