Listen to this article

▪️అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.స్త్రీనిధి కార్యక్రమ అమలులో కరీంనగర్ డిఆర్డిఓకు రాష్ట్రస్థాయి మూడవ అవార్డు వచ్చింది.స్త్రీనిధి 12 వ సర్వసభ్య సమావేశం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియం, గచ్చిబౌలి, హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాష్ట్ర స్థాయి మూడవ స్థానం అవార్డు ప్రదానం చేశారు.స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను డి ఆర్ డి ఓ కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు డి ఆర్ డి ఓ సునీత అవార్డు అందుకున్నారు.కరీంనగర్ డి ఆర్ డి ఓ అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు. స్త్రీనిధి ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి పొందాలని అన్నారు. తద్వారా ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీధర్, ఏపీ డి సునీత, స్త్రీనిధి, ఆర్ ఎం ఎస్.కె మధార్, మెప్మా పీడీ వేణు మాధవ్ పాల్గొన్నారు.