Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, డబ్బు సప్పులతో, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.