Listen to this article

జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు :ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశం ఒకే ఎన్నిక బిజెపి దృష్టి కోణం భారతదేశంలో ఏకకాలిక ఎన్నికల సంస్మరణల కార్యశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ గొల్ల కోటి త్రినాధ రావు జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం సీనియర్ నాయకులు సంక హేమ సుందర్ హాజరై నారు వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించుటకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దీని ద్వారా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ప్రజాధనం వృధా జరగదని పరిపాలన సైతం వేగంగా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజల సైతం ఇలాంటి డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారని దీనివల్ల సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని మనమందరం ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతించి మండల స్థాయిలో బూత్ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి పార్టీలకు అతీతంగా యువకులను మేధావులను భాగస్వామ్యం చేసుకొని వారి సహకారంతో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ వివరించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకే దేశం ఒకే ఎన్నిక మండల కన్వీనర్ బొల్లె సునీల్ మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్ మండల ఉపాధ్యక్షుడు చిట్టెం ఈశ్వరరావు మండల యువ మోర్చా అధ్యక్షుడు నోముల శ్రీ కిషన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్ ఎస్టి మోర్చా అధ్యక్షుడు మట్టి రమేష్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గారా ఆదినారాయణ,మాదాల సంతోష్, రామేళ్ల రాజు,బొల్లె నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు