Listen to this article

జనం న్యూస్ 28 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్: జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్,జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాగంగా అమలు పరిచే ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీ గా అమలు పరుచటకు అధునాతన పరికరాలు పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనీ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.అందుకు సంబంధించిన ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్-10, రిఫ్లెక్ట్ జాకెట్స్ -10, బ్రీత్ అనలైసర్స్ – 09, బొల్లార్డ్స్ -50, బాటమ్స్ -20 , రేడియం టేప్ రోలర్స్ -25 పరికరాలను జిల్లా ఎస్పీ గారు ఈ రోజు తన ఛాంబర్ లో ట్రాఫిక్ ఎస్సై బాల చందర్ కు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లో ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీగా అమలు పరచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అధునాతన ట్రాఫిక్ పరికరాలను ట్రాఫిక్ మరియు పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తేవడం జరిగిందనీ అన్నారు. గతం లో ఉన్నా బ్రీత్ ఆనలైసర్ స్థానంలో మార్పులు జరిగి నాబ్ లేకుండానే కేవలం బ్లో చెయ్యడం ద్వారా నే అది సెన్సార్ తో పని చెయ్యడం ద్వారా మధ్యం సేవించిండా లేదా అనేది ఈ నూతన పరికరం ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చని అన్నారు . కాలానుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి , ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి మరియు ట్రాఫిక్/పోలీస్ సిబ్బంది ఎఫెక్టివ్ గా విధులు నిర్వహించడానికి ఈ ట్రాఫిక్ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ ఒ సతీష్ కుమార్, ట్రాపిక్ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా