Listen to this article

జనం న్యూస్ 2025 జనవరి 14 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)

 ఈ పండుగ యెక్క ప్రత్యేకత ఏమిటంటే నెలరోజలు ముందు నుండే పండుగ హడావిడి మెదలవుతుంది. ప్రతీ ఇంటిముందూ రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మరులుస్తాడు. గంగిరెద్దులు, కోడిపందాలు, ఎడ్లపందాలు మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మెత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లపాదీ మిగతారోజలు ఎక్కడ ఉన్నా సరే ఈపండుగకు ఇళ్లలో వాలిపోతారు. పిండివంటల తయారీకి పండుగకు పదిరోజులు ముందు నుండే హడావిడి మెదలవుతుంది. అరిసెలు, పాకుండలు, చక్కినాలు, మిటాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మెత్తం రైతులకు చేతికివస్తుంది. దీనితో ఏపండుగకైనా ఖర్చుకు వెనకాడతారేమో గానీ ఈరోజుమాత్రం సందేహించరు. అందుకేయేమో సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలు కనీసం అరడజనుకు తగ్గకుండా విడుదలవుతాయి. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేస్తారు. అందకే దీనిని పతంగుల పండుగ లని కూడా పిలుస్తారు.
సంక్రాంతి రోజు వేకువజామునే నిద్రలేచి తలమ్మటా స్నానం చేసి తెలిగింటి ఆడపడుచులు సింగారస్తూ ముగ్గులు పెడుతుంటే, పెద్దవాళ్లు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు. సేమియా పాయినం, గారెలు, బూరెలు మెదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి, రజకులకు, క్షౌరకులకు ఇంకా చుట్టుపక్కలవారికి తాము వండుకున్న పిండివంటలను రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం ఎక్కడున్నా తోలిపండుగకు భార్యతో అత్తవారిటికి వెళ్లడం అనావాయితీ. వీరితో కొంటె మరదళ్లు చేసే సందడి సరే సరి. పితృదేవతలకు ఈరోజున పితృతర్పణాలు సమర్పిస్తారు. ఈపండుగ ఒక ఎత్తు అయితే ముందూ, వునుకా వచ్చే పండుగలు ఒకెత్తుఅవే భోగి,కనుమ. అని అంటారు