

జనం న్యూస్ మార్చి 28 (నడిగూడెం ప్రతినిధి ఉపేందర్)స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం నడిగూడెం రాజావారి కోటను సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులు కోటను సందర్శించి చరిత్రను తెలుసుకున్నారు. గ్రంథాలయము, గార్డెన్,108 అడుగులు కలిగిన జాతీయ జెండా, అదేవిధంగా జాతీయ జెండా రూప కల్పన గడిలో జరిగిన విషయాన్ని న్యాయవాది, డాక్రి నిర్వాహకులు కె. జితేంద్ర బాబు విద్యార్థులకు వివరించారు. కోట చరిత్రను తెలుగు సాహిత్యం ప్రాధాన్యతను తెలియజేశారు. కోటలో ఉన్న గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన పుస్తకాలకు సంబంధించి సమాచారాన్ని అందించారు. నడిగూడెం రాజా రాజా నాయని వెంకట రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు , పింగళి వెంకయ్య తదితరుల చరిత్రను వివరించారు. గడి చరిత్రను తెలియజేశారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనలో విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. అదేవిధంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని క్షేత్ర పర్యటనలో పరిశీలించారు. క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులు కొత్త విషయాలను అవగాహన చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, సునీత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.