

జనం న్యూస్ మార్చి 28 నడిగూడెం :మండలం లోని కరివిరాల గ్రామానికి చెందిన కురిపాటి రాములు, ఉప్పమ్మ దంపతుల కుమారుడు కురిపాటి నరేష్ ఆర్మీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం 2024 సంవత్సరంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో నరేష్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ కేటగిరి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు.