Listen to this article

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. బంజారా భాష 8 వ షెడ్యూల్ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బంజారాలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా అత్యధికంగా 40 లక్షల పై చిలుకు ఉన్న లంబాడి ల యొక్క మాతృ భాష గోర్ భోలీ భాషా ను ఈ రోజు రాజ్యాంగంలోనీ 8వ షెడ్యూల్డ్ లో చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాగంగా అసెంబ్లీలో తీర్మానించినందుకు. బంజారా జాతీ తరుపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి మరియూ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు కి ప్రత్యేక ధన్యవాదము తెలియచేస్తున్నాం. అదే విధంగా ఈ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు లో బిల్లు ఆమోదం చేసి.. గోర్ భోలీ భాషా ను రాజ్యాంగ లో 8 వ షెడ్యూల్డ్ లో చేర్పించాలని బంజారా శక్తి మూవ్మెంట్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు రవినాయక్, దేవేందర్ జాదవ్,మరియు నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్. రాష్ట్ర ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం కు కోరారు. రవి నాయక్ బంజారా శక్తి మూవ్మెంట్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు. ప్రవీణ్ నాయక్.నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు.