Listen to this article

వేం పాపాలు,కట తొలగించే,ఈశ్వరుడు

భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి

  • శ్రీ వేంకటేశ్వరుడు…
  • వేంకటేశ్వర అనుబంధం విష్ణువు అవతారం…
  • నివాసం వైకుంఠం…
  • మంత్రం ఓం నమో వేంకటేశాయ,ఓం నమో నారాయణ…
  • ఆయుధములు శంఖం,చక్రం…
  • గుర్తులు శ్రీచరణం…
  • భర్త / భార్య
    శ్రీదేవి / లక్ష్మీ / అలమేలు మంగ, భూదేవి…
  • వాహనం గరుడ…
  • మతం హైందవం…

జనం న్యూస్,మార్చ్ 29,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామం సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలోని ఓ కొండపై వెలసిన కలియుగ దైవంగా వేం – పాపాలు,కట – తొలగించే,ఈశ్వరుడు, దేవుడు.తన భక్తుల కష్టాలను తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు.రెండు వందల సంవత్సరాల ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం శ్రీలక్ష్మి వెంకటాచలపతి నివాసాలయం,ఈ ఆలయంలో అనాదికాలం నుంచే నూతన సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఉగాది సంబరాలు,ఘనంగా నిర్వహిస్తుంటారు.ఈ కార్యక్రమంలో భాగంగానే 2025/03/30, ఆదివారం కలియుగ దైవం నారాయణుడి సన్నిధిలో రాత్రి 9 గంటల నుంచి హరిభక్త పారాయణులు నందు మహారాజ్,సంకీర్తన హరి జాగరణ, 2025/03/31, సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,మహా పూజ,మహా మంగళ నిరంజనాలు,ద్వాజారోహణం,మహా నివేదనం, అనంతరం ఉత్తర ద్వారా ప్రవేశం, ఉదయం 10 గంటల నుంచి హరిభక్త పారాయణులు కరణ్ గజేంద్ర భారతి మహారాజ్,సంకీర్తన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వేద పండితులు,తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరాధించే శ్రీలక్ష్మి వెంకటాచలపతి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని, కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామ శివారులోని దట్టమైన అరణ్యంలో ఈ ఆలయం వెలిసిందని ఆ ప్రాంత ప్రజలు,భక్తుల కోరికలు తీర్చే శ్రీలక్ష్మి వెంకటాచలపతి నివాసుడుని కొలుస్తారు.