

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తున్న షేక్ మౌల,పఠాన్ మెహర్ ఖాన్.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
రంజాన్ పండుగ పేదవారు, ధనికులు అనే బేధం లేకుండా అందరూ కలిసి మెలసి చేసుకునే పండుగ రంజాన్ పండుగ అని నందలూరు మండల మైనారిటీ నాయకులు షేక్ మౌలా పటాన్ మెహర్ ఖాన్ లు అన్నారు. శుక్రవారం నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని నందలూరు జిల్లా పరిషత్ క్రీడామైదానం పరిసర ప్రాంతాలలో మరియు నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేదలైనటువంటి ముస్లిం మైనారిటీలకు ఆ ప్రాంతంలోని స్థానికుల సమాచారం మేరకు 15 మంది నిరుపేదలకు రంజాన్ తోఫా ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో నందలూరు మండలంలో పేద, ధనిక అనే భేదము లేకుండా ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. మండలంలోని ప్రతి పల్లెలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని పూర్తి చేసి రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపు కునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తమ స్నేహితులు, బంధువులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పార్టీలకతీతంగా నాయకుల సహాయ సహకారాలతో మండలంలోని ప్రతి పల్లెలో పేద కుటుంబాలను ఎంపిక చేసి వారికి పండుగకు కావాల్సినటువంటి 15 రకాల సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అనుకునేవారు కింద ఇచ్చిన నంబర్లకు తమకు తోచినంత నగదును పంపించవచ్చని వారు తెలిపారు. Phone pay number షేక్. మౌల 8125694757, పటాన్ మెహర్ ఖాన్ 7396500319.
