

మీ సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా:ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,మార్చి29,
అచ్యుతాపురం:అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురంలో ఉన్న నివాసం వద్ద నమావేశం నిర్వహించారు.అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు వద్దు నగదు రూపంలోనే పరిహారం కావాలని కోరారు.ఎమ్మెల్యే ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని రహదారి విస్తరణకు అందరూ సహకరించాలని, మీ సమస్యలు ఏమున్నా వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.