Listen to this article

జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం రామ చంద్రపురం మజీద్ లో పెద్ద ఎత్తున మైనారిటీ ముస్లిం సోదరులు
తమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు షేక్ అబ్దుల్ ఘనీ సహాబ్. ఏకే పౌండేషన్ చైర్మన్. షేక్ అబ్దుల్ ఖదీర్ సహాబ్. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లు 2024 ను. తక్షణమే ఉపసంహరించుకోని వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని కోరారు. ముస్లిం సమాజం ఎన్నటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును అంగీకరించబోదని వక్ఫ్ బిల్లును ఉపసంహరించే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు యువకులు తదితరులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.