

▪️ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం..
జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్// జమ్మికుంట)..
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరుకై, బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం వినతి పత్రం అందజేశారు.ఉత్తర తెలంగాణలోని (రెండవ ) స్థానమైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరుకై, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం శనివారం రోజున రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ చేపడుతున్న, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ.. తమ పాలకవర్గం ఆధ్వర్యంలో, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సహకారంతో నిధులు మంజూరు కై, కృషి చేస్తానని రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు.