Listen to this article

జనం న్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో శనివారం ఉదయం ఎడు గంటల నుండి ఎదురుకాల్పులు జరుగుతు న్నాయి సూక్ష్మ జిల్లా గోగుండ కొండపై ఊపంపల్లి ప్రాంతం లో ఈరోజు ఉదయం నుండి మావోయిస్టులకు భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఈ ఎదురు కాల్పుల్లో పది హేను మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది, మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆపరే షన్లో డిఆర్జి సిఆర్పిఎఫ్ జవానులు పాల్గొన్నారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఎదురు కాల్పులు ఇంకా కొనసాగు తున్నట్లు పోలీస్ నిఘా వర్గాల సమాచారం.కొండపై గంగలూరు పోలీస్ స్టేషన్ ఏరియా బీజాపూర్ పరిధిలో భద్రతా సిబ్బంది సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కొనసా గుతోంది దీనికి సంబంధిం చిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.