

జనం న్యూస్- మార్చి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా రమావత్ మోహన్ నాయక్ ను ఎంపిక చేసినట్లుగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమావత్ జవహర్ నాయక్, సహాయ కార్యదర్శి రామావత్ నరేష్ నాయక్ లు నియామక పత్రం అందజేశారు, ఈ సందర్భంగా టి ఆర్ జి ఎస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ తండాలలో గిరిజనులు వైద్య సౌకర్యాలు లేక ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు అభివృద్ధి పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు, శుక్రవారం నాగర్జున సాగర్ హిల్ కాలనీ విజయ్ విహార్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో టి ఆర్ జి ఎస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా రమావత్ మోహన్ నాయక్, పెదవుల మండల ఉపాధ్యక్షులుగా రమావత్ కిరణ్ నాయక్, తిరుమలగిరి సాగర్ మండల సహాయ కార్యదర్శిగా జటావత్ వెంకట్ రామ్ నాయక్, జటావత్ సర్దార్ నాయకులకు నియామక పత్రాలను అందజేశారు, ఈ కార్యక్రమంలో టి ఆర్ జి ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మెగావత్ భాస్కర్ నాయక్, నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ లాలునాయక్ ,గౌరవ సలహాదారుడు జటావత్ రాముల నాయక్ ,నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సభావత్ గులాబీ, పెదవుర మండల అధ్యక్షులు రమావత్ శీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.
